Congress: ఐదేళ్లు వాడుకున్నాడు... గండ్ర లైంగిక వేధింపులపై పక్కా ఆధారాలు ఉన్నాయి: విజయలక్ష్మి ఆరోపణలు

  • కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై విజయలక్ష్మి ఆరోపణలు
  • సీసీ కెమెరాలు, కాల్ రికార్డును పరిశీలించాలని వినతి
  • పోలీసుల వద్ద తన ఫోన్ ఉందన్న విజయలక్ష్మి

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, తనతో ఆయన శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న దానికి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత మహిళ విజయలక్ష్మీ రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, గండ్ర ఇంటిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే, తాను ఎన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్లి వచ్చానన్న విషయం తెలుస్తుందని, ఆయన తన భార్య ముందే తనతో గడిపేవాడని సంచలన ఆరోపణలు చేశారు.

ఆ ఇంట్లో బెడ్ రూమ్ ఎక్కడుందో తనకు తెలుసునని, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందన్న సంగతి మొత్తం చెబుతానని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కాల్ లిస్టును బయటకు తీస్తే గండ్ర తనతో ఎన్నిసార్లు మాట్లాడారన్న సంగతి తెలుస్తుందని, ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపింది.

తాను సామాజిక కార్యక్రమాలు చేస్తుండగా గండ్రతో పరిచయం ఏర్పడి, అది చనువుగా మారిందని, గత ఐదేళ్లుగా తాము ఎన్నోమార్లు కలిశామని, అయితే, నాలుగు రోజుల క్రితం వరకూ తనపై ఎంతో ప్రేమ చూపిన ఆయన, ఒక్కసారిగా మారిపోయి, ఈనెల 3వ తేదీన తనను రమ్మని చెప్పి, పోలీసులతో అరెస్ట్ చేయించారని విజయలక్ష్మి ఆరోపించారు.

ప్రస్తుతం తన ఫోన్ ను పోలీసులు తీసుకున్నారని, వారు అందులోని సమాచారాన్ని డిలీట్ చేస్తారన్న ఆందోళన తనలో ఉందని ఆమె వాపోయింది. కాగా, తనపై వెంకటలక్ష్మి నిరాధారమైన ఆరోపణలు చేయిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులు ఆమె వెనుక ఉన్నారని గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Congress
Gandra Venkataramana Reddy
Vijayalakshmi
Harrasment
Jayashankar Bhupalpally District
  • Loading...

More Telugu News