kesineni nani: ఆధార్ లేనివాడూ ఆంధ్రా గురించి మాట్లాడటమే: బీజేపీ నేతపై కేశినేని ఫైర్

  • జీవీఎల్ కు ఆంధ్రాలో అడ్రస్ లేదని మండిపాటు
  • దమ్ముంటే అవినీతిని నిరూపించాలని సవాల్
  • పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుపై తెలుగుదేశం నేత కేశినేని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరసింహరావు అడ్రస్ అసలు ఆంధ్రప్రదేశ్ లోనే లేదని విమర్శించారు. జీవీఎల్ కు ఆధార్, పాస్ పోర్ట్ ఎక్కడ ఉన్నాయో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న జీవీఎల్.. దమ్ముంటే దాన్ని నిరూపించాలని నాని సవాల్ విసిరారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే అది పార్లమెంటుకు ముప్పని జీవీఎల్ చెప్పడాన్ని నాని ఖండించారు. గతంలో పార్లమెంటు సమీపంలో మోదీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

kesineni nani
gvl narasimharao
Telugudesam
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News