pawan kalyan: సోమవారం హత్తిబెళగల్ వెళుతున్న పవన్ కల్యాణ్.. క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ!
- క్వారీ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- స్థానికుల అభ్యంతరాలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- మృతుల బంధువులను, గాయపడ్డ వారిని పరామర్శించనున్న జనసేనాని
కర్నూలు జిల్లా హత్తిబెళగల్ గ్రామంలోని క్వారీలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ ల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు మృత్యువాత పడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. క్వారీ ఉన్న గ్రామంతోపాటు పరిసర పల్లెల వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని... అంటే ప్రభుత్వమే అక్రమ పద్ధతుల్లో తవ్వకాలకు వంతపాడుతున్నట్లుగా ఉందని అన్నారు. సోమవారం హత్తిబెళగల్ వెళ్లి, అక్కడి ప్రజలను కలసి, పరిస్థితులను పరిశీలిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని, మృతుల బంధువులను పవన్ పరామర్శించనున్నారు. కర్నూలు పర్యటన నేపథ్యంలో, పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రెండు రోజులు ఆలస్యమవుతుందని జనసేన పార్టీ తెలిపింది.