surya: మరోసారి సూర్య జోడీకట్టనున్న అనుష్క?

  • సూర్య కోసం కథ రెడీ చేసిన హరి 
  • కథానాయిక కోసం అనుష్కతో సంప్రదింపులు 
  • అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్  

'భాగమతి' సూపర్ హిట్ అయినా .. ఆ తరువాత ఏ సినిమాకు అనుష్క సైన్ చేయలేదు. కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల కోసం ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరి కూడా అనుష్కను సంప్రదించినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

తమిళనాట మాస్ డైరెక్టర్ గా హరికి మంచి పేరుంది. సూర్య హీరోగా చేసిన 'సింగం' సిరీస్ హరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూడు సినిమాల్లోను అనుష్క నటించింది. ఈసారి చేసేది 'సింగం' సీక్వెల్ కాకపోయినప్పటికీ, సూర్య జోడీగా అనుష్కనే తీసుకోవాలని ఆయన భావించాడట. అందువల్లనే అనుష్కకి కథ వినిపించాడని అంటున్నారు. హిట్ కాంబినేషన్ కావడం వలన అనుష్క అంగీకరించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కేవీ ఆనంద్ .. సుధా కొంగర సినిమాల తరువాత సూర్య ఈ సినిమా చేయనున్నాడని అంటున్నారు.   

  • Loading...

More Telugu News