Air India: మిలాన్-ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి దూరిన ప్రయాణికుడు.. వెనక్కి మళ్లించిన పైలట్!

  • మిలాన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం
  • కాక్‌పిట్‌లోకి దూరేందుకు ప్రయాణికుడి యత్నం
  • వెనక్కి మళ్లించి పోలీసులకు అప్పగింత

ప్రయాణికుడు ఒకరు  విమానం కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ నెల రెండో తేదీన రాత్రి మిలాన్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఇటలీలోని మిలాన్ నుంచి బయలుదేరిన కాసేపటికే గురుప్రతీ సింగ్ అనే ప్రయాణికుడు విమానం‌ కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు విమాన సిబ్బంది తెలిపారు.

అతడి చేష్టతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి మిలాన్ కు మళ్లించి ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానం తిరిగి రెండున్నర గంటల ఆలస్యంగా ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

Air India
Milan
New Delhi
Italy
cockpit
  • Loading...

More Telugu News