Krishna District: నిమ్మకూరులో ప్రత్యేక పూజలు చేసి రంగంలోకి దిగిన క్రిష్, బాలకృష్ణ!

  • ఈ ఉదయం నిమ్మకూరులో బాలయ్య, క్రిష్
  • 'ఎన్టీఆర్' చిత్ర బృందం మొత్తం నిమ్మకూరులోనే
  • సినిమాలోని కొన్ని సీన్స్ తీయనున్న క్రిష్

ఈ ఉదయం కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వచ్చిన హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ లు అక్కడి ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆపై స్థానిక వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న వీరిద్దరూ, సినిమాకు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలను నిమ్మకూరులో రెండు మూడు రోజుల పాటు చిత్రీకరించేందుకు వచ్చారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు తదితరాలను సినిమాలో కొంత చూపించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ నిమ్మకూరుకు వచ్చింది. ఎన్టీఆర్ చిన్నప్పటి విశేషాలకు గ్రామంలోని పెద్దలను అడిగి తెలుసుకుని, కొన్ని ఆసక్తికర అంశాలను క్రిష్ ఈ చిత్రంలో చేరుస్తారని సమాచారం. కాగా, తమ గ్రామానికి వచ్చిన చిత్ర టీమ్ కు అక్కడి ప్రజలు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి స్వాగతం పలికారు.

Krishna District
Nimmakuru
Balakrishna
Krish
NTR
Biopic
  • Loading...

More Telugu News