Brand babu: మహిళా విలేకరి ఫిర్యాదుతో 'బ్రాండ్ బాబు'పై కేసు నమోదు!

  • శుక్రవారం నాడు విడుదలైన బ్రాండ్ బాబు
  • తన అనుమతి లేకుండా ఫొటో వాడుకున్నారని ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

కన్నడ హీరో సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'బ్రాండ్ బాబు'పై ఓ మహిళా జర్నలిస్టు చేసిన ఫిర్యాదుతో హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాలోని ఓ మరణ సన్నివేశంలో తన ఫొటోను చూపించారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తన అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించడంపై ఆమె కేసు పెట్టగా, ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు రిజిస్టర్ చేశామని, విచారిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. కాగా, రెండు రోజుల క్రితం విడుదైన చిత్రానికి ప్రభాకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Brand babu
Police
Hyderabad
Lady Journalist
  • Loading...

More Telugu News