agri godl: ‘అగ్రిగోల్డ్’ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ
- ‘అగ్రిగోల్డ్’ను రూ.4 వేల కోట్లకు కొనుగోలు చేస్తాం
- నాలుగేళ్ల గడువు కావాలని కోరిన జీ-ఎస్సెల్
- ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా
‘అగ్రిగోల్డ్’ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ‘అగ్రిగోల్డ్’ను రూ.4 వేల కోట్లకు కొనుగోలు చేస్తామని, కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగేళ్ల గడువు కావాలని జీ-ఎస్సెల్ సంస్థ కోరింది. దీనిపై పిటిషనర్, ‘అగ్రిగోల్డ్’ బాధితుల సంఘం అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకవేళ సంస్థ ఆస్తులను జీ-ఎస్సెల్ కొనుగోలు చేస్తే తొలుత రూ.500 కోట్లు డిపాజిట్ చేయాలని, ఏడాది లోపు మొత్తం కొనుగోలు ప్రక్రియను ఈ సంస్థ పూర్తి చేయాలని వారు కోరారు. జీ-ఎస్సెల్ ప్రతిపాదనలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.