minister kalva: మంత్రి కాల్వకు తృటిలో తప్పిన ప్రమాదం

  • అనంతపురం జిల్లాలో సంఘటన
  • కల్వర్టును ఢీకొట్టిన కాల్వ కారు
  • సురక్షితంగా బయటపడ్డ కాల్వ, జెడ్పీ చైర్మన్ నాగరాజు

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో కల్వర్టును ఆయన కారు ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో కాల్వ శ్రీనివాసులుతో పాటు జెడ్పీ చైర్మన్ నాగరాజు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఈ సమాచారం సీఎం చంద్రబాబుకు తెలియడంతో కాల్వ శ్రీనివాసులుకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు.

minister kalva
ananthapuram
  • Loading...

More Telugu News