illegal contact: అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తున్న భార్య.. న్యాయం చేయాలంటూ భర్త ఆందోళన!

  • పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం
  • కొద్ది రోజులకే మనస్పర్థలు
  • సర్పంచ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య

తన భార్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని... తనకు న్యాయం చేయాలంటూ ఓ భర్త ఆందోళనకు దిగాడు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ప్లకార్డు పట్టుకుని, న్యాయం కోసం అర్థించాడు. వివరాల్లోకి వెళ్తే చొప్పదిండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాసాచారి, రుక్మాపూర్ కు చెందిన లావణ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2015లో కులాంతర వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ గొడవలకు సంబంధించి రుక్మాపూర్ సర్పంచ్ కర్రె శ్రీనివాస్ వద్ద పంచాయితీ జరిగింది.

తమ మధ్య నెలకొన్న మనస్పర్థలను అదనుగా తీసుకుని తన భార్యతో కర్రె శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాసాచారి ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చొప్పదిండి పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపాడు. అయితే కేసు విత్ డ్రా చేసుకోమని ఆమె కోరడంతో, మానవతా దృక్పథంతో కేసును వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. కానీ, ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని వాపోయాడు. సర్పంచ్ తో పాటు ఆమె బావ తిరుపతి తనపై ఎస్సీ, ఎస్టీ, వరకట్నం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పాడు. తనను వేధింపులకు గురిచేస్తున్న వీరందరిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరాడు. 

illegal contact
husband
wife
Karimnagar District
  • Loading...

More Telugu News