Kamal Haasan: బిగ్‌బాస్ హౌస్‌లో జయలలితకు అవమానం.. కమలహాసన్‌పై కేసు నమోదు!

  • కమల హాసన్‌పై చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు
  • జయను డిక్టేటర్‌గా సంబోధించిన పోటీదారు
  • షోను కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న ఫిర్యాదుదారు

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నేత కమలహాసన్‌పై కేసు నమోదైంది. తమిళ బిగ్‌బాస్-2కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్.. బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను ‘డిక్టేటర్’గా సంబోధించి అవమానించారంటూ కమల్‌పై ఫిర్యాదు నమోదైంది. హౌస్‌లోని పోటీదారు ఐశ్వర్య.. జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు.

కమల్ ఆమె వ్యాఖ్యలకు వంత పలకడమే కాకుండా జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ రమేశ్ గ్రేటర్ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు షోలో జయలలితను అవమానించేలా మాట్లాడుతున్నారని అందులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అవమానిస్తున్న కమల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో రేపు ప్రసారం కానుంది.

Kamal Haasan
Big Boss-2
Tamilnadu
Chennai
TV show
Case
  • Loading...

More Telugu News