Karunanidhi: ఆసుపత్రిలో కరుణ.. షాక్‌తో మరణించిన 21 మంది కార్యకర్తలు!

  • తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దన్న పార్టీ
  • సంయమనం పాటించాలని వేడుకోలు
  • విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానన్న స్టాలిన్

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆసుపత్రి పాలయ్యారన్న విషయాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్తలు 21 మంది మృతి చెందినట్టు డీఎంకే తెలిపింది. కార్యకర్తలు సంయమనం పాటించాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది.

కరుణానిధి ఆసుపత్రి పాలవడాన్ని తట్టుకోలేక 21 మంది మృతి చెందిన విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలు తనను బాధించాయని పేర్కొన్న స్టాలిన్ బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, బలవన్మరణాలకు పాల్పడిన వారి వివరాలను ఆయన బయటపెట్టలేదు. కాగా, గత  ఐదు రోజులుగా కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు స్టాలిన్ తెలిపారు.

Karunanidhi
Tamilnadu
DMK
Stalin
Kauveri Hospital
  • Loading...

More Telugu News