Hyderabad: విమానం ల్యాండ్ అవుతుంటే మంటలు... శంషాబాద్ లో తప్పిన పెను ప్రమాదం!

  • కువైట్ నుంచి వచ్చిన విమానం
  • సుమారు 150 మంది ప్రయాణికులు
  • కుడివైపు ఇంజన్ నుంచి మంటలు

హైదరాబాద్, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో కువైట్ నుంచి వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. గాల్లోనే మంటలను గమనించిన పైలట్, విషయాన్ని విమానాశ్రయ అధికారులకు చేరవేయగా, వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు.

ఆపై ల్యాండ్ అవుతున్న సమయంలో మంటలు పెరిగాయి. దీంతో విమానాన్ని రన్ వే పక్కనే నిలిపివేశాడు పైలట్. సుమారు 150 మంది ప్రయాణికులతో ఈ విమానం కువైట్ నుంచి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రన్ వేను ఆనుకుని విమానం ఆగిపోవడంతో, దాన్ని అక్కడి నుంచి పక్కకు తీసేంత వరకూ ఇతర విమానాలను దారి మళ్లించడంతో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Hyderabad
RGIA
Kuwait
Flight
Fire Accident
  • Loading...

More Telugu News