Mahesh Babu: తన తండ్రి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన మహేష్ బాబు తనయ

  • ఓ మొక్క నాటి నీరు పోసిన సితార
  • ‘యూట్యూబ్’లో సంబంధిత వీడియో
  • తన ఛాలెంజ్ ను పూర్తి చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి

తెలంగాణ మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసుల గ్రీన్ ఛాలెంజ్ ను హీరో మహేష్ బాబు పూర్తి చేసి, మరో ముగ్గురిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో మహేష్ పిల్లలు సితార, గౌతమ్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. మహేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి చేశారు.సితార ఓ మొక్క నాటి, నీళ్లు పోసింది. ఇందుకు సంబంధించిన వీడియో ‘యూట్యూబ్’ కు చేరింది.

కాగా, తన పేరు నామినేట్ చేసినందుకు మహేష్ బాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని, ‘గ్రీన్ ఛాలెంజ్’ని పూర్తి చేశానని తన ట్వీట్ లో వంశీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఆయన నామినేట్ చేశారు. హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు వంశీ పైడిపల్లి ‘గ్రీన్ ఛాలెంజ్’ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News