KCR: కదంబ మొక్కని నాటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్!

  • ప్రారంభమైన నాలుగో విడుత హరితహారం
  • గజ్వేల్‌లో కార్యక్రమానికి  శ్రీకారం
  • ఒకేరోజు లక్షా నూటా పదహారు మొక్కలు

నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌ లోని స్థానిక ఇందిరా పార్కు కూడలి వద్ద కదంబ మొక్కని నాటారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటిన అనంతరం సైరన్ వేయడంతో గజ్వేల్‌ పరిధిలో ఒకేరోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

KCR
harithaharam
Hyderabad
Hyderabad District
Telangana
TRS
  • Loading...

More Telugu News