: రాంగోపాల్ వర్మ సినిమాపై సెన్సార్ బోర్డులో ఫిర్యాదు
దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన '26/11 దాడులు' సినిమాపై హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు నమోదయింది. ముంబై దాడులు కథాంశంగా రూపొందిన ఈ చిత్రం మతసామరస్యానికి వ్యతిరేకంగా తీశారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రామ్ ప్రసాద్ ఈ ఫిర్యాదు చేశారు.
దేశ అంతర్గత భద్రతని ప్రశ్నించేలా తీసిన ఈ సినిమా విడుదలని నిలిపివేయాలని ఆయన సెన్సార్ బోర్డును కోరారు. హైకోర్టులో కూడా ఈ సినిమా విడుదలపై పిటిషన్ వేయనున్నట్లు రామ్ ప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా తీసిన ఈ చిత్రం విడుదలయితే మతకలహాలు చెలరేగే అవకాశం అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.