Chiranjeevi: అన్న చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన తమ్ముడు పవన్!

  • చిరంజీవికి సవాల్ విసిరిన ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి 
  • పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన పవన్
  • ఫొటోలు పోస్ట్ చేసిన ‘జనసేన’ అధినేత

ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన చిరంజీవి మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసరడం తెలిసిందే. ఆ ముగ్గురిలో జనసేన పార్టీ అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. తన అన్న విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పవన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ‘జనసేన’ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో పవన్ మొక్కలు నాటారు.   

  • Loading...

More Telugu News