vijay mallya: లండన్ కోర్టులో మాల్యాకు ఊరట.. బెయిల్ పొడిగింపు!

  • మాల్యాకు బెయిల్ పొడిగించిన వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు
  • ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలు వీడియో సమర్పించాలంటూ భారత ప్రభుత్వానికి విన్నపం
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఊరట లభించింది. మాల్యాకు బెయిల్ నిరాకరించాలంటూ భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు... ఆయనకు బెయిల్ ను పొడిగించింది. ఒకవేళ మాల్యాను భారత్ కు అప్పగిస్తే... ఆయనను ఉంచబోయే ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలు వీడియోను సమర్పించాలని కోరింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో... తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. భారత ప్రభుత్వం తరపున కోర్టుకు సీబీఐ, ఈడీ సీనియర్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. మాల్యా కూడా కోర్టుకు వెళ్లారు.

ఈ సందర్భంగా మీడియాతో మాల్యా మాట్లాడుతూ, తాను డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. బ్యాంకులకు డబ్బు చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే... చెల్లించడానికి తాను సిద్ధమని అన్నారు. తనకు ఉన్న రూ. 14 వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలను చెల్లిస్తానని చెప్పారు. 

vijay mallya
london
west minister magistrate court
bail
  • Loading...

More Telugu News