Chiranjeevi: ఎన్టీవీ చౌదరి ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి.. వీడియో చూడండి

  • చిరంజీవికి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ఎన్టీవీ చౌదరి
  • ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటిన మెగాస్టార్
  • మంచి హరిత కార్యక్రమాన్ని చేయించినందుకు చౌదరికి ధన్యవాదాలు అన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన ఇంట్లోని గార్డెన్ లో మూడు మొక్కలు నాటారు. ఎన్టీవీ ఛానల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్ ను స్వీకరించిన చిరంజీవి... మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.
"ఎన్టీవీ చౌదరి గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ... ఈరోజు మా ఇంటి పెరట్లో నేను మూడు మొక్కలు నాటడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఛాలెంజ్ విసిరి, నాతో ఒక మంచి హరిత కార్యక్రమాన్ని చేయించినందుకు ఎన్టీవీ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ వీడియో ద్వారా ఆయన తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మెగాస్టార్ చెప్పారు.

Chiranjeevi
ntv
narendra chowdary
green challenge
  • Error fetching data: Network response was not ok

More Telugu News