Colombia: ఆ శునకాన్ని చంపేస్తే రూ.48 లక్షలు ఇస్తాం.. కొలంబియా మాఫియా బంపర్ ఆఫర్!

  • కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్న సోంబ్రా
  • ఆగ్రహంతో ఊగిపోతున్న స్మగ్లర్లు
  • భారీ భద్రత కల్పించిన పోలీసులు

కొలంబియాలోని డ్రగ్ మాఫియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమను ఇబ్బంది పెడుతున్న ఓ కుక్కను చంపేస్తే ఏకంగా రూ.48 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అసలు మాఫియాకు, ఈ కుక్కకు సంబంధం ఏంటనుకుంటున్నారా? వీళ్ల వ్యాపారాలను దెబ్బతీసి, అనుచరుల్ని జైలుకు పంపిస్తోంది ఆ కుక్కే కాబట్టి.

డ్రగ్స్ కు స్వర్గధామంగా మారిన కొలంబియాలో జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన పోలీస్ జాగిలం సోంబ్రా స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా మారింది. బొగోటా అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ విభాగం పోలీసులతో కలసి పనిచేస్తున్న సోంబ్రా.. స్మగ్లర్లు మాదకద్రవ్యాలను ఏ రూపంలో, ఎక్కడ దాచినా ఇట్టే పట్టేస్తోంది. కేవలం ఆరేళ్ల వయసున్న ఈ కుక్క ఇప్పటివరకూ 300 ఆపరేషన్లలో పాల్గొని 5.4 టన్నుల కొకైన్, టర్బో వంటి మాదకద్రవ్యాలను పట్టేసింది. అంతేకాకుండా ఇటీవల కారు విడిభాగాల్లో దాచి ఎగుమతి చేయడానికి యత్నించిన 4 టన్నుల డ్రగ్స్ ను పసిగట్టింది. ఈ జాగిలం కారణంగా 245 మంది స్మగ్లర్లను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టగలిగారు.

దీంతో కొలంబియాలో శక్తిమంతమైన అరబెనోస్ గ్యాంగ్ సోంబ్రాపై పగ పెంచుకుంది. ఈ కుక్కను చంపిన వారికి ఏకంగా రూ.48 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని పసిగట్టిన కొలంబియా నిఘా వర్గాలు పోలీసుల్ని అప్రమత్తం చేశాయి. దీంతో అధికారులు సోంబ్రాకు సాయుధ రక్షణ కల్పించారు.

  • Loading...

More Telugu News