Prakasam District: ప్రకాశం జిల్లా ప్రియుడి సజీవ దహనం కేసు: 'పోకిరి' సినిమాలో మంచానికి కట్టేసే సీన్ చూసే అలా చేసిందట!

  • షబ్బీర్ ను మంచానికి కట్టేసి నిప్పంటించిన షకీరా
  • ప్రకాశం జిల్లా పొదిలిలో కలకలం
  • షబ్బీర్ కున్న అసహజ కోరికలే ప్రాణాలు తీశాయన్న పోలీసులు

ప్రకాశం జిల్లా పొదిలిలో షేక్ షబ్బీర్ (32) అనే హోమ్ గార్డును మంచానికి ఇనుప గొలుసులతో కట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించిన షకీరా అలియాస్ ఇమాంబీని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్య పొదిలి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపగా, దాదాపు పుష్కరం క్రితం వచ్చిన 'పోకిరి' సినిమాలోని ఓ సీన్, తనను ఇలా చేసేందుకు ప్రేరేపించిందని షకీరా వెల్లడించినట్టు తెలుస్తోంది.

తనకు షబ్బీర్ తో సంబంధం ఉందని, ఇద్దరమూ కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతుండగా, డబ్బు విషయంలో గొడవలు వచ్చేవని వెల్లడించిన ఆమె, అతన్ని చంపాలని నిర్ణయించుకున్నానని పోలీసులకు తెలిపింది. అతన్ని కోళ్ల ఫారమ్ వద్దకు పిలిపించి, సినిమాలోని సీన్ ను గుర్తు చేసి, అలా చేద్దామని చెప్పి, గొలుసులతో కట్టేశానని, ఇక కదల్లేడని భావించిన తరువాత కిరోసిన్ పోసి నిప్పంటించానని అంగీకరించింది.

శృంగారం విషయంలో షబ్బీర్ కు ఉన్న కొన్ని అసహజ కోరికలను షకీరా వాడుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గతంలో పలుమార్లు వారిద్దరూ ఇలాగే శృంగారాన్ని అనుభవించారని అన్నారు. చివరకు ఆ అలవాటే షబ్బీర్ ప్రాణాలు పోయేందుకు కారణమైందని, ఈ కేసులో ఆమెను మరింతగా విచారించాల్సి వుందని, కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత కస్టడీ కోరతామని పోలీసులు వెల్లడించారు.

Prakasam District
Podili
Murder
Pokiri
  • Loading...

More Telugu News