Mahesh Babu: హరితహారం చాలెంజ్‌ను స్వీకరించిన మహేశ్‌బాబు.. తన బిడ్డలనే నామినేట్ చేసిన వైనం!

  • తోటలో మొక్కను నాటిన మహేశ్ బాబు
  • సితార, గౌతమ్‌తోపాటు దర్శకుడు వంశీకి చాలెంజ్
  • పర్యావరణానికి మేలు చేస్తుందన్న స్టార్ హీరో

తెలంగాణలో హరితహారం చాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. చాలెంజ్‌ను స్వీకరించిన ప్రతి ఒక్కరు మరో ముగ్గురిని నామినేట్ చేస్తుండడంతో రాష్ట్రమంతా విస్తరించింది. తాజాగా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు తన తోటలో మొక్కను నాటారు.

అందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన మహేశ్.. మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసులు ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించానని పేర్కొన్నాడు. గ్రీన్ చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. పర్యావరణానికి ఈ చాలెంజ్ ఎంతో మేలు చేస్తుందన్న మహేశ్.. తన ఇద్దరు బిడ్డలు సితార, గౌతమ్‌లతోపాటు దర్శకుడు వంశీలకు చాలెంజ్ విసిరాడు.

Mahesh Babu
Tollywood
Green challenge
Harita Haram
Telangana
  • Loading...

More Telugu News