shakalaka shankar: 'డ్రైవర్ రాముడు' కోసం స్కార్లెట్, షకలక శంకర్‌ డ్యాన్సులు!

  • షూటింగు దశలో 'డ్రైవర్ రాముడు'
  • దర్శకుడిగా రాజ్ సత్య 
  • ఐటమ్ సాంగులో స్కార్లెట్ విల్సన్

కమెడియన్ గా తన సత్తా చాటుకున్న షకలక శంకర్, హీరోగాను మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో వున్నాడు. ఇటీవలే 'శంభో శంకర' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, తదుపరి చిత్రంగా 'డ్రైవర్ రాముడు' సినిమా చేస్తున్నాడు. వేణుగోపాల్ .. రాజు .. కీరత్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, పాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్లో షకలక శంకర్ .. స్కార్లెట్ విల్సన్ పై శివశంకర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' .. 'ఎవడు' .. 'బాహుబలి' వంటి సినిమాల్లోని ప్రత్యేక గీతాల ద్వారా స్కార్లెట్ విల్సన్ అలరించింది. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ .. ఈ ప్రత్యేక గీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.       

shakalaka shankar
  • Loading...

More Telugu News