kanna lakshminarayana: మాపై మీడియాకు ఎందుకంత కోపం?: కన్నా లక్ష్మీనారాయణ

  • రైల్వే జోన్ ఏర్పాటుపై అధికారుల కమిటీ సంప్రదింపులు జరుపుతోంది
  • రైల్వే జోన్ ఇస్తామని రాజ్ నాథ్ చెప్పారు
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ బురద చల్లుతోంది

విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుపై అధికారుల కమిటీ సంప్రదింపులు జరుపుతోందని... అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం తెలిపిందని చెప్పారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైల్వే జోన్ ఇస్తామని చెప్పారని కన్నా అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై టీడీపీ బురద చల్లుతోందని మండిపడ్డారు. మీడియాలో కూడా ఇలాంటి కథనాలే వస్తున్నాయని... బీజేపీపై మీడియాకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని చెప్పారు.

kanna lakshminarayana
visakhapatnam
railway zone
  • Loading...

More Telugu News