Geetha Govindam: నాన్నా.. నాకో కారు కొనివ్వు!: అరవింద్ ను కోరిన బన్నీ

  • ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అల్లు అర్జున్
  • వాటితో తనకో కారు కొనిపెట్టాలని కోరిక
  • గీత గోవిందం ఆడియో రిలీజ్ సందర్భంగా ఘటన

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ ను విచిత్రమైన కోరిక కోరాడు. త్వరలోనే తనకో కారు కొనివ్వాలని అడిగాడు. బన్నీ కారు కోసం తండ్రిని అడగడం ఏంటి అనుకుంటున్నారా? ఈ అసక్తికరమైన ఘటన ‘గీత గోవిందం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చోటుచేసుకుంది.


ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి అరవింద్ తో కలసి హాజరైన బన్నీ, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించారంటూ కితాబిచ్చాడు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ప్రశంసించాడు. అనంతరం అరవింద్ కు ఆల్ ది  బెస్ట్ చెప్పిన బన్నీ, ఎక్కువ డబ్బులు సంపాదించి తనకో కారు కొని పెట్టాలని కోరాడు. దీంతో స్టేజ్ పై ఉన్న దర్శకుడు పరశురామ్, విజయ్, రష్మిక సహా అందరి మొహాలపై నవ్వులు పూశాయి.

విజయ్ దేవర కొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Geetha Govindam
Vijay Deverakonda
Rashmika Mandanna
Allu Arjun
audio release
Hyderabad
  • Loading...

More Telugu News