Talasani: బోనం తెచ్చిన మహిళలు కష్టపడ్డారన్న అమ్మ మాటలు వాస్తవమే!: మంత్రి తలసాని

  • కొందరు మహిళా భక్తులకు అసంతృప్తి కలిగింది
  • విషయం తమ దృష్టికి వచ్చిందన్న తలసాని
  • ఆలయంలో స్థలాభావం వల్లే సమస్యన్న మంత్రి

భవిష్యవాణిలో అమ్మ చెప్పిన మాటలు వాస్తవమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అంగీకరించారు. ఈ ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్వర్ణలత రంగం కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న బోనాల సందర్భంగా కొందరు మహిళా భక్తులు అసంతృప్తికి గురైన సంగతి తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఆలయంలో చాలినంత స్థలం లేక ఇబ్బందులు కలిగాయని, తాము రాజకీయాలకు అతీతంగా అందరికీ అమ్మ దర్శనం కల్పించామని అన్నారు.

అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేశాయని కితాబిచ్చిన ఆయన, ఈ సంవత్సరం జరిగిన ఘటనలు వచ్చే సంవత్సరం పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మకు బంగారు బోనం సమర్పించామని, ఇది చారిత్రాత్మకమని ఆయన అన్నారు. కాగా, తనకు బోనం తెచ్చిన ఆడపడుచులకు ఎంతో కష్టం కలిగిందని రంగం సందర్భంగా స్వర్ణలత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Talasani
Rangam
Swarnalatha
Mahamkali Temple
  • Loading...

More Telugu News