kotla suryaprakash reddy: టీడీపీ నేతలు దద్దమ్మల్లా చోద్యం చూస్తున్నారు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • కర్నూలు జిల్లా నీటిని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు
  • టీడీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది
  • కర్నూలు సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు 

కర్నూలు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాకు ఉపయోగపడాల్సిన సాగునీటిని జీవో 272 ద్వారా అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే... జిల్లా టీడీపీ నేతలు దద్దమ్మల్లా చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు.

ఎన్ఆర్ఈజీఎస్ పనులు, నీరు-చెట్టు, మరుగుదొడ్ల నిర్మాణం పనుల పేరుతో టీడీపీ నేతలు కోట్లాది రూపాయలను దండుకున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, రియలెస్టేట్ మాఫియా చెలరేగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హంద్రీనీవా నీటితో చెరువులు నింపుతామంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కర్నూలులో ఆగస్టు 18న మహాసభను నిర్వహిస్తున్నామని... ఆ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు.

kotla suryaprakash reddy
ke krishnamurthy
Rahul Gandhi
  • Loading...

More Telugu News