Andhra Pradesh: జగన్ నిజస్వరూపం అదే.. రోజుకు కాస్తంత చూపిస్తున్నారు!: దేవినేని ఉమ

  • అభివృద్ధి కనిపించడం లేదా?
  • బీజేపీతో కుమ్మక్కై ఎంపీలను ఇంటికి పరిమితం చేశారు
  • రైతుల త్యాగాన్ని అపహాస్యం చేస్తున్నారు

వైకాపా అధినేత వైఎస్ జగన్ కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏ మాత్రమూ కంటికి కనిపించడం లేదని, ఆయన తన నిజస్వరూపాన్ని ప్రజల ముందు, రోజుకు కాస్తంత చొప్పున ఉంచుతున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజధానిని భ్రమరావతి అంటూ రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం పనులు, అమరావతిలో నిర్మాణాలు జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించిన దేవినేని, అసలు పులివెందులకు జగన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలే ప్రోగ్రెస్ రిపోర్టును ఇస్తారని, బీజేపీతో కుమ్మక్కై, తన ఎంపీలతో రాజీనామా చేయించి ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఆయనదేనని నిప్పులు చెరిగారు. బీజేపీతో లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జగన్ నిజస్వరూపాన్ని ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్ తో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పవన్ బయలుదేరారని, వారిద్దరూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News