Tirumala: పాత రికార్డులన్నీ బద్దలు... ఒక్క రోజులో తిరుమల వెంకన్నకు రూ. 6.28 కోట్ల ఆదాయం!

  • గత రికార్డు 2012 శ్రీరామనవమి నాటి ఆదాయం
  • ఆరేళ్ల తరువాత హుండీ ఆదాయంలో కొత్త రికార్డు
  • రూ. 1.64 కోట్ల చిల్లర నాణాలు కూడా

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ చరిత్రలో హుండీ ఆదాయం రికార్డులు బద్దలయ్యాయి. 2012లో శ్రీరామనవమి (ఏప్రిల్ 1) నాడు హుండీ ద్వారా వచ్చిన రూ. 5.73 కోట్ల ఆదాయం ఇంతవరకూ రికార్డు కాగా, ఇప్పుడది మరుగున పడిపోయింది. ఈ నెల 26న గురువారం నాడు హుండీ ద్వారా రూ. 6.28 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆలయ చరిత్రలో పాత హుండీ ఆదాయ రికార్డులన్నీ బద్దలయ్యాయని అధికారులు ప్రకటించారు.

 ఈ మొత్తంలో రూ. 1.64 కోట్ల చిల్లర నాణాలు ఉన్నాయని అన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు తరువాత 2017 ఆరంభంలో శ్రీవారి హుండీ ఆదాయం కొన్ని రోజుల పాటు రూ. 4 కోట్లను దాటుతూ వచ్చింది. అదే సంవత్సరం మార్చి 28న రూ. 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది కూడా. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ గురువారం నాటి ఆదాయం దాటేసింది.

Tirumala
Tirupati
Hundi
Revenue
Record
  • Loading...

More Telugu News