America: అమెరికాలో బహిరంగ బ్రెస్ట్‌ ఫీడింగ్ ఇక చట్టబద్ధం.. మహిళల హర్షం!

  • బిడ్డలకు బహిరంగంగా పాలివ్వడంపై తొలగిన నిషేధం
  • ఉతా, ఇదాహో రాష్ట్రాలు కూడా అంగీకారం
  • ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఇప్పటికే చట్టబద్ధత

బిడ్డలకు బహిరంగంగా స్తన్యమివ్వడంపై ఇప్పటి వరకు ఉన్న వివాదం అమెరికాలో ముగిసిపోయింది. దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ బహిరంగ బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఉన్న నిషేధం తొలగిపోయింది. ఇప్పటి వరకు బహిరంగంగా స్తన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉతా, ఇదాహో రాష్ట్రాలు కూడా ఇందులో చేరడంతో బహిరంగ బ్రెస్ట్ ఫీడింగ్ చట్టబద్ధమైంది. బిడ్డలకు బహిరంగంగా పాలిచ్చే తల్లులకు పోలీసులు భారీ జరిమానాలు విధించేవారు. ఇప్పుడు దీనికి లీగల్ ప్రొటెక్షన్ రావడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

అయితే, తల్లులకు చాలా సాధారణమైన బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో చట్టబద్ధత కల్పించడానికి అమెరికా ఇన్నేళ్లు తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దీనిని ఇప్పటికే చట్టబద్ధం చేయగా, అమెరికాకు ఇన్నేళ్లు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అమెరికా వ్యాప్తంగా నిషేధం తొలగిపోవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

America
Breastfeeding
England
Australia
Legal
  • Loading...

More Telugu News