idea: ఎయిర్ టెల్ కి పోటీగా కొత్త ప్లాన్ ని ప్రకటించిన ఐడియా!

  • రూ.295 ప్లాన్ ని ప్రకటించిన ఐడియా
  • 5జీబీ డేటా, 42రోజుల వ్యాలిడిటీ
  • రోజులో 250 నిమిషాలు, వారంలో 1000 నిమిషాలు ఉచితం

ఎయిర్ టెల్ రూ.299 ప్లాన్ కి పోటీగా ఐడియా టెలికాం సంస్థ కొత్త ప్లాన్ ని ప్రకటించింది. 42రోజుల వ్యాలిడిటీతో ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.295 ప్లాన్ ని ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా 5జీబీ డేటాతో పాటు ఒక రోజులో 250 నిమిషాలు, వారంలో 1000 నిమిషాల వరకు మాత్రమే ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ పరిమితిని దాటితే సెకనుకి 1 పైసా ఛార్జ్ చేయబడుతుంది.

అలాగే ఈ ఆఫర్లో రోజుకు 100ఎస్‌ఎంఎస్‌ లను అందజేయనున్నట్టు ఐడియా తెలిపింది. కాగా, ఎయిర్ టెల్ రూ.299 ఆఫర్ లో ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా 45 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ లను ఉపయోగించుకునే వీలుంది.

idea
airtel
Tech-News
Hyderabad
  • Loading...

More Telugu News