paruchuri: ఆ సినిమా విషయంలో రెండు విమర్శలు బాగా వినిపించాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • కథ విన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు 
  • అందుకని ఆ సీన్స్ ను కదల్చలేదు 
  • అలా చేయడమే విమర్శలకి కారణమైంది

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'పల్నాటి బ్రహ్మనాయుడు ' సినిమాకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ఫస్టు ఎపిసోడ్ లోనే కథ అయిపోయింది .. ఈ విషయం అప్పుడు తట్టలేదు. ఇక నేను గమనించిన మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువైపోయాయి.

ఈ సినిమాలో అప్పుడు బాగా విమర్శలకి గురైన సీన్లు రెండు వున్నాయి. ఒకటి .. జయప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి సవాల్ చేసిన బాలకృష్ణ .. చూపుడు వేలుతో సైగ చేయగానే జయప్రకాశ్ రెడ్డి కూర్చున్న కుర్చీ ముందుకు వచ్చేస్తుంది. ఇక రెండవది .. రెండు రైళ్లు ఎదురుపడినప్పుడు, బాలకృష్ణగారు తొడగొడితే విలన్ గ్యాంగ్ వున్న రైలు వెనక్కి వెళ్లిపోయే సీన్. ఆ సీన్ ను మరో రకంగా చేద్దామని నేను ముందుగానే గోపాల్ కి చెప్పాను .. కానీ కథ విన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. అలాంటి సీన్ ను ఎందుకు ముట్టుకోవడం అని వదిలేశాం" అని చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News