sushanth: నాగ్ చేతుల మీదుగా 'చి ల సౌ' ట్రైలర్ రిలీజ్

  • తెరపైకి మరో ప్రేమకథా చిత్రం 
  • సుశాంత్ జోడీగా రుహాని శర్మ 
  • వచ్చేనెల 3వ తేదీన విడుదల

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ .. రుహాని శర్మ జంటగా 'చి ల సౌ' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ .. సిరుని సినీ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, వచ్చేనెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పెళ్లి చేసుకోమంటూ హీరోని ఒకవైపున తల్లి .. మరో వైపున స్నేహితులు ఒత్తిడి చేస్తుంటారు. దాంతో తనకి పెళ్లి ఇష్టం లేదంటూనే అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య చోటు చేసుకునే సరదాలు .. కలహాలతో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కొనసాగింది. ఈ తరం కుర్రకారుకి ఎక్కే కంటెంట్ తోనే ఈ సినిమా రూపొందిందనే విషయం అర్థమవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వుండటం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ప్రశాంత్ విహారి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అనిపిస్తోంది.

sushanth
ruhani sharma
  • Error fetching data: Network response was not ok

More Telugu News