Pawan Kalyan: ఓటు విలువ నాటుకోడిపెట్ట విలువలా తయారైంది: పవన్ కల్యాణ్

  • జనసేన ప్రశ్నించే పార్టీనే కాదు..పాలించే పార్టీ కూడా
  • సీఎంని చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పను
  • ఓట్లు వేసినా వేయకపోయినా సమస్యలపై పోరాడతా

ఓటు విలువ నాటుకోడిపెట్ట విలువలాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదని, పాలించే పార్టీ కూడా అని అన్నారు. తనను ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పనని, ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా సమస్యలపై పోరాడతానని అన్నారు.

వ్యక్తిగత సమస్యలను తీర్చలేను గానీ, పబ్లిక్ పాలసీ రూపంలో అందరికీ భద్రత కలిగిన సమాజాన్ని మాత్రం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. శక్తి ఉన్నప్పుడే ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ప్రజా జీవితంలోకి వచ్చానని చెప్పారు. పవన్ కల్యాణ్ చుట్టూ చిన్నపిల్లలే ఉన్నారని కొందరు విమర్శిస్తున్నారని, అది నిజమేనని, తాను రాజకీయాల్లోకి వచ్చింది భావితరాల కోసమేనని, దోపిడీ చేసే వారి కోసం కాదని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News