adivi sesh: నాని చేతుల మీదుగా 'గూఢచారి' ట్రైలర్ రిలీజ్

  • అడివి శేష్ హీరోగా 'గూఢచారి'
  • కీలకపాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. సుప్రియ 
  • ఆగస్టు 3వ తేదీన విడుదల

అభిషేక్ పిక్చర్స్ వారు .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా 'గూఢచారి' సినిమాను నిర్మించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అడివి శేష్ .. శోభిత ధూళిపాళ నాయకా నాయికలుగా కనిపించనున్నారు. తాజాగా నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా కొనసాగుతుందని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, టైటిల్ కి తగినట్టుగానే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. వెన్నెల కిషోర్ .. సుప్రియ కీలకమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో అడివి శేష్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

  • Loading...

More Telugu News