sensex: స్టాక్ మార్కెట్ జోరు.. సరికొత్త రికార్డులు!
- 37 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
- 111 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- నష్టాలు చవిచూసిన అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు
ఈరోజు ట్రేడింగ్ లో సూచీలు జోరుగా సాగాయి. సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా 37 వేల మార్క్ పైనా, నిఫ్టీ 11,200 పైన ముగిసి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 37,337 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 11,278 వద్ద ముగిశాయి.
కాగా, ఎన్ఎస్ఈలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందాల్కో, ఐటీసీ, టైటాన్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైన సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.