nayanatara: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నయనతార ట్రైలర్

  • తమిళంలో 'కొలమావు కోకిల'
  • తెలుగులోకి 'కో కో కోకిల'
  • రెండు భాషల్లో ఆగస్టు 17న రిలీజ్

ఈ మధ్య కాలంలో నయనతార ఎక్కువగా నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తూ వస్తోంది. అలా తాజాగా ఆమె 'కొలమావు కోకిల' అనే తమిళ సినిమా చేసింది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె డ్రగ్స్ ను సప్లై చేసే యువతిగా నటించింది. పేదరికంలో పుట్టిపెరిగిన కథానాయిక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే కథాంశం.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో 'కో కో కోకిల' అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నయనతార జీవితంలోని మలుపులను హైలైట్ చేస్తూనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నయనతార కొత్త లుక్ తో కనిపిస్తూ .. సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.


  • Loading...

More Telugu News