Madhya Pradesh: విటుడిగా వెళ్లి సెక్స్ రాకెట్ ఆట కట్టించిన పోలీసాఫీసర్!

  • మధ్యప్రదేశ్ లోని పాన్పూర్ ప్రాంతంలో సెక్స్ రాకెట్ ముఠా
  • మఫ్టీలో వెళ్లిన పోలీసు అధికారి
  • ముగ్గురు మైనర్ బాలికలు, ఏడుగురు యువతులు రెస్క్యూ హోమ్ కు

మధ్యప్రదేశ్ లోని పాన్పూర్ ప్రాంతంలో సెక్స్ రాకెట్ ముఠా ఆటను కట్టించేందుకు ఓ పోలీసు అధికారి విటుడి రూపంలో వెళ్లి, తనకు ఓ అమ్మాయి కావాలని కోరి, వారి ఆటను కట్టించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు రెంట్ కు తీసుకుని మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి లాగి, వారిని బలిపశువులను చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది.

ఈ సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేయాలన్న ఉద్దేశంతో, ఓ పోలీసు అధికారి మఫ్టీలో పాన్పూర్ లోని వ్యభిచార దందా సాగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మధ్యవర్తులు తారసపడి వేశ్యాగృహానికి తీసుకెళ్లగా, ఆపై సదరు అధికారి ఇచ్చిన సమాచారంతో, అక్కడికి దగ్గర్లోనే మకాం వేసిన పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మైనర్ బాలికలను, ఏడుగురు యువతులను, దందా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిందితులపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశామని, పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Madhya Pradesh
Police
S*x Racket
Rescue Home
  • Loading...

More Telugu News