Andhra Pradesh: ఏపీకి హోదా పేరు లేకపోతేనేం.. ఆ ప్రయోజనాలు అందుతున్నాయిగా!: జీవీఎల్

  • హోదా లేకున్నా అన్నీ ఇస్తున్నాం
  • నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
  • పారదర్శకత విషయంలో ఏపీ భయపడుతోంది

ఆంధ్రప్రదేశ్‌కు హోదా అన్న పేరొక్కటే లేదని, కానీ హోదాతో దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే, స్పెషల్ పర్పస్‌ వెహికల్ ఏర్పాటుకు ఆ రాష్ట్రమే ముందుకు రావడం లేదని ఆరోపించారు. అందుకు ముందుకొస్తే నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత ఉంటుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. రాయితీలు ఏ రాష్ట్రానికీ లేవని, నిజానికి రాయితీలకు, హోదాకు సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీకి ఐదేళ్ల రెవెన్యూ లోటు భర్తీకి గాను గ్రాంట్‌గా రూ.22,112 కోట్లను కేంద్రం ఇస్తున్నట్టు తెలిపారు.

Andhra Pradesh
GVL Narasimharao
Lok Sabha
Special Category Status
  • Loading...

More Telugu News