sensex: నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు
- సెన్సెక్స్ తొలిసారిగా 37 వేల మార్క్
- 35 పాయింట్ల లాభంతో 11,167 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
- బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల అండతో నిలబడ్డ లాభాలు
నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 37 వేల మార్క్ ను తాకగా.. నిఫ్టీ 35 పాయింట్ల లాభం సాధించింది. సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 36,985 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,167 వద్ద స్థిరపడ్డాయి. జులై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేటితో ముగుస్తుండటంతో చివరి గంటల్లో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్ చివరి గంటల్లో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల అండతో లాభాలను నిలబెట్టుకుంది.
కాగా, ఎన్ఎస్ఈలో గ్రాసిమ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఐషర్ మోటార్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. హిందూస్థాన్ పెట్రోలియం, యస్ బ్యాంక్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి.