Karunanidhi: కరుణానిధి ఆరోగ్యంపై కొత్త వదంతులు.. స్పందించిన స్టాలిన్!

  • కరుణ ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం
  • స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారంతే
  • వదంతులు నమ్మవద్దన్న స్టాలిన్

తమిళనాడు మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఆరోగ్యంపై రాష్ట్రంలో వదంతులు చెలరేగుతున్నాయి. కరుణానిధి జ్వరంతో బాధపడుతుండగా, ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురికాగా, ఆయన కుమారుడు, డీఎంకే నేత స్టాలిన్ ఈ ఉదయం దీనిపై మీడియాతో మాట్లాడారు.

 కరుణానిధి అనారోగ్యంగా ఉన్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని, ఆయన బాగున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. వదంతులను నమ్మవద్దని చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వుందని, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. కార్యకర్తలు, పార్టీ నేతలు ఎవరూ గోపాలపురం (కరుణానిధి ఇంటి ప్రాంతం) రావద్దని సూచించారు. ఆయన కేవలం స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన కుటుంబ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

Karunanidhi
Stalin
Health
Condition
  • Loading...

More Telugu News