Jayashankar Bhupalpally District: టీఆర్ఎస్ నాయకులకు శిక్ష తప్పదు... కలకలం రేపుతున్న మావోయిస్టుల కరపత్రాలు!

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరపత్రాలు
  • భారీగా డబ్బు దండుకుంటున్నారని ఆరోపణలు
  • అధికార, విపక్షాలకు చెందిన 20 మంది పేర్ల వెల్లడి

భూ ప్రక్షాళన పేరిట రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా డబ్బు దండుకున్నారని, భూకబ్జాలు చేశారని ఆరోపిస్తూ, వీరంతా ప్రజా కోర్టులో శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంటూ ముద్రితమైన మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి రావడం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపుతోంది.

జిల్లాలోని మహాముత్తారం, వెంకటాపురం మండలాల్లో ఈ కరపత్రాలను మావోయిస్టులు పంచినట్టు తెలుస్తుండగా, ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు వాటిలో తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట ఈ పత్రాలుండగా, రెండు పడక గదుల ఇళ్లలో అక్రమాలు జరిగాయని, కొందరు కాంగ్రెస్ నాయకులకూ అవినీతిలో భాగముందని మావోయిస్టులు ఆరోపించారు. అధికార, విపక్ష పార్టీలకు చెందిన 20 మంది పేర్లను ప్రస్తావిస్తూ, వారిని శిక్షిస్తామని కరపత్రాలు పంచారు.

Jayashankar Bhupalpally District
Maoists
Posters
TRS
Congress
Leaders
  • Loading...

More Telugu News