You Tube: యూట్యూబ్ లో చూస్తూ ఇంట్లోనే ప్రసవానికి యువతి ప్రయత్నం... ప్రాణాలు కోల్పోయిన వైనం!

  • ప్రసవంపై యూట్యూబ్ వీడియోలు చూసిన జంట
  • ఇంట్లోనే ప్రసవానికి సిద్ధమైన భార్య కృతిక
  • తీవ్ర రక్తస్రావమై మృతి

యూట్యూబ్ లో ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ, ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భార్య ప్రాణాలను బలిగొంది. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న కృతిక (28), ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆమె భర్త యూట్యూబ్ ను బాగా ఫాలో అవుతుండేవారు. వీరికి మూడేళ్ల పాప ఉండగా, కృతిక మరోసారి గర్భం దాల్చింది. డెలివరీ వేళ, ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని భావించిన ఈ జంట, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో యూట్యూబ్ వీడియోలను చూశారు.

తర్వాత నెలలు నిండి నొప్పులు ప్రారంభమైతే, తాము వీడియోలో చూసినట్టుగా చేశారు. అయితే, బిడ్డ పుట్టిన తరువాత కృతికకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో భయపడిన భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే సరికే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, భర్తను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు ఒకరు సహజ ప్రసవాలు చేస్తుండేదని, ఆమె సూచనతోనే ఈ పని చేశామని అతను చెప్పినట్టు సమాచారం.

You Tube
Tamilnadu
Delivery
Pregnency
  • Loading...

More Telugu News