Pawan Kalyan: తన ట్వీట్ లో తప్పులు సరిదిద్డుతూ మరో ట్వీట్ పెట్టిన పవన్ కల్యాణ్!

  • ఈ ఉదయం ఫ్యాన్స్ కు పవన్ సలహా
  • తొలి ట్వీట్ లో 'వెళ్లను' బదులు 'వెళ్లాను'
  • తప్పు సరిదిద్దుకుని రీట్వీట్ పెట్టిన పవన్

ఈ ఉదయం తన ఫ్యాన్స్ కు జగన్ కుటుంబీకులను, ఆడ పడుచులను వివాదంలోకి లాగవద్దని సూచిస్తూ పెట్టిన ట్వీట్ లో కొన్ని తప్పులు దొర్లడంతో దాన్ని సరిదిద్దుకున్న పవన్ కల్యాణ్ పాత ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ పెట్టారు. తొలి ట్వీట్ లో 'నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను' అని ఉండాల్సిన దానికి పొరపాటున 'నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లాను' అని వచ్చింది.
 ఆపై కొన్ని వాక్య నిర్మాణ తప్పులనూ ఆయన సరిదిద్దుకుని, రీట్వీట్ చేశారు. ఆ రెండు ట్వీట్ల స్క్రీన్ షాట్ లను మీరూ చూడవచ్చు.

Pawan Kalyan
Twitter
Mistakes
  • Loading...

More Telugu News