ntr: 'అరవింద సమేత .. 'గురించి ఇషా రెబ్బా

  • నేను చేస్తున్నది గెస్టు రోల్ కాదు 
  • సినిమా అంతా కనిపిస్తాను 
  • ఎన్టీఆర్ తో సాంగ్స్ కూడా వున్నాయి  

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' షూటింగు దశలో వుంది. రీసెంట్ గా ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, ఇందులో ఇషా రెబ్బా గెస్టు రోల్ లో కనిపించనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి ఇషా రెబ్బా స్పందించింది.

ఈ సినిమాలో తాను చేస్తున్నది గెస్ట్ రోల్ కాదు అనీ, మరో కథానాయికగా సినిమా అంతా కనిపించనున్నానని అంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథలో కాకుండా .. హైదరాబాద్ లో జరిగే కథలో తాను కాస్త రెబల్ గానే కనిపిస్తానని చెప్పింది. ఎన్టీఆర్ తో తనకి సాంగ్స్ కూడా ఉన్నాయనీ .. ఆయనతో కలిసి స్టెప్పులు కూడా వేయనున్నానని అంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అందునా ఎన్టీఆర్ సరసన తనకి ఛాన్స్ లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.   

ntr
pooja hegde
eesha rebba
  • Loading...

More Telugu News