karthi: వైఎస్ జగన్ పాత్రలో సూర్య కాదు .. కార్తీ!

  • షూటింగు దశలో 'యాత్ర'
  • సూర్యను సంప్రదించిన దర్శక నిర్మాతలు 
  • కార్తీ పేరును సూచించిన సూర్య

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర' సినిమా రూపొందుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా చేస్తున్నారు. ఆయన పోర్షన్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చకచకా కొనసాగుతోంది.

ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్రకు సూర్య అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించారట. ప్రస్తుతం సూర్య హీరోగాను .. నిర్మాతగాను వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అదే విషయాన్ని ఆయన ఈ సినిమా దర్శక నిర్మాతలకి చెప్పాడట. ఈ పాత్రకి కార్తీ అయితే కరెక్టుగా సెట్ అవుతాడంటూ తమ్ముడి పేరును సూచించాడట. దాంతో జగన్ పాత్రకు గాను కార్తీ పేరు ఖరారైపోయినట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. 'చినబాబు' వంటి రైతు నేపథ్యం కలిగిన సినిమా తరువాత కార్తీ ఈ పాత్రను చేయడం కలిసొచ్చే అంశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

  • Loading...

More Telugu News