paruchuri: రచయితను నమ్మే అతికొద్దిమంది దర్శకులలో వినాయక్ ఒకరు: పరుచూరి గోపాలకృష్ణ

  • వినాయక్ తో మంచి ర్యాపో వుంది 
  • మంచి కాంబినేషన్ మాది 
  • ఆయనను మోడ్రన్ గోపాల్ అంటూ వుంటాము  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా, దర్శకుడు వినాయక్ తో తమకి గల అనుబంధాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆది .. చెన్నకేశవరెడ్డి .. ఠాగూర్ తరువాత మా కాంబినేషన్లో 'ఖైదీ నెంబర్ 150' వచ్చింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందనేది మీ అందరికీ తెలిసిందే.

మొదటి నుంచి కూడా వినాయక్ మమ్మల్ని పెద్ద గురువుగారు .. చిన్న గురువుగారు అనే పిలుస్తుంటాడు. మొన్న కూడా బాలకృష్ణ కోసం ఆయనకి నేను ఒక కథ చెప్పాను. మొదటి అరగంట వరకూ బాగుందన్నాడు .. ఆ తరువాత 'కిక్ పోయినట్టుంది గురువు గారు .. మీరు అమెరికా వెళ్లొచ్చిన తరువాత మళ్లీ కూర్చుందాం' అన్నాడు. ఆయనకీ .. మాకు మధ్య మంచి ర్యాపో వుంది. బి.గోపాల్ తరువాత మాకు బాగా నచ్చిన దర్శకుడాయన. రచయితను నమ్మే అతికొద్దిమందిలో బి. గోపాల్ ఒకరు ..  ఆ తరువాత స్థానంలో మాకు వినాయక్ కనిపిస్తాడు .. అందుకే ఆయనని మేం మోడ్రన్ గోపాల్ అని పిలుస్తుంటాము" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News