Manchiryala: మంచిర్యాలలో రూ. 20కి చీర... కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన మహిళలు!

  • ముందుగానే ప్రచారం చేయించిన వస్త్ర దుకాణం యజమాని
  • వందల సంఖ్యలో క్యూ కట్టిన మహిళలు
  • ప్రజాసేవ చేస్తున్నానన్న దుకాణం యజమాని

మంచిర్యాలలోని ఓ వస్త్ర దుకాణం రూ. 20 రూపాయలకే చీరను అందిస్తామని ప్రచారం చేయడంతో మహిళలు భారీగా క్యూ కట్టారు. ఈ విషయమై గత కొంత కాలంగా సదరు దుకాణం కరపత్రాల ద్వారా ప్రచారం చేయించింది. ఈ మాట ఆ నోటా, ఈ నోటా వ్యాపించగా, వందల సంఖ్యలో మహిళలు రూ. 20 చీర కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. తమ సిబ్బందితో ముందు వచ్చిన మహిళలకు ముందు ప్రాతిపదికన టోకెన్లు ఇప్పించి వస్త్ర దుకాణం యజమాని, మాటిచ్చినట్టుగా వారికి 20 రూపాయలకే చీరను అందించారు. తాను ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, అందులో భాగంగానే ఇలా చీరలను అతి తక్కువ ధరకు విక్రయించానని ఆయన చెప్పడం గమనార్హం.

Manchiryala
Clothing Store
Rs. 20 Only
Saree
Long Queue
  • Loading...

More Telugu News