pakistan: ఓటు హక్కు వినియోగించుకున్న బెనజీర్ భుట్టో కుమార్తెలు
- పాక్ లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్
- నవాబ్ షాలో ఓటు వేసిన భుట్టో కుమార్తెలు
- ఇమ్రాన్, షరీఫ్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ
పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ పోలింగ్ లో 10.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది.
ఇక పోలింగ్ పూర్తయిన 24 గంటల్లోనే తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తెలు భక్తవార్ భుట్టో, అసీఫా భుట్టోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింధ్ లోని నవాబ్ షాలో వారు ఓటు వేశారు. అనంతరం తాము ఓటు వేసినట్టు వేలి ముద్రను చూపుతూ మీడియాకు ఓ స్టిల్ ఇచ్చారు.