Tollywood: శ్రీరెడ్డిపై తమిళనాడులో వ్యభిచారం కేసు!

  • ఎంతో మంది వాడుకున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు
  • అది వ్యభిచారమేనన్న ఇండియన్ మక్కల్ మంద్రం
  • చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పదే పదే ప్రశ్నిస్తూ, తనను ఎంతో మంది వాడుకున్నారని చెబుతూ, సోషల్ మీడియాలో ఒక్కొక్కరి పేర్లనూ బయట పెడుతున్న నటి శ్రీరెడ్డిపై తమిళనాడులో వ్యభిచార నేరం కింద కేసు నమోదైంది. ఇండియన్ మక్కల్ మంద్రం (ఐఎంఎం) అనే సంస్థ ఈ ఫిర్యాదు చేసింది.

చెన్నై పోలీస్ కమిషనర్ ను కలిసిన ఐఎంఎం సభ్యులు, ఆమె సినిమా అవకాశాల కోసం దర్శకులు, హీరోలు, ఇతరులతో గడిపినట్టు స్వయంగా అంగీకరిస్తున్నందున, అది వ్యభిచారం కిందకే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలు భారత సంస్కృతిని, స్త్రీ జాతిని అవమానిస్తున్నాయని ఆరోపించారు. కాగా, శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారిపైనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురుగదాస్, విశాల్ తదితరులపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. దీంతో నడిగర్ సంఘం కూడా ఆమెపై చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.

Tollywood
Sri Reddy
Casting Couch
Prostitution
  • Loading...

More Telugu News